ఓవర్ టేక్ చేసే క్రమంలో కారుపై పడ్డ ట్రక్కు..ఆరుగురు మృతి 1 y ago
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బికనీర్ జిల్లా దేశ్ నోక్ పట్టణంలోని ఓ ఫ్లైఓవర్ వద్ద లోడ్ తో వెళ్తున్న ఓ ట్రక్ కారును ఓవర్ టేక్ చేయబోయి దానిపై పడింది. దీంతో కారు నుజ్జునుజ్జయ్యింది. అందులోని ఆరుగురు దుర్మరణం చెందారు. దేశ్ నోక్ పోలీసులు సహయక చర్యలు చేపట్టారు. క్రేన్, మూడు జేసీబీల సాయంతో ట్రాలీని తొలగించారు. మృతదేహాలను పీఎంబీ ఆసుపత్రి మార్చురీలో ఉంచామని పోలీస్ అధికారి సునీల్ తెలిపారు.